పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0384-1 ఆహిరి సంపుటం: 11-499

పల్లవి: ఒ ద్దన్నా మానవు నీవోజ లిట్టివి
         పెద్దరికము నేయుచుఁ బ్రియము లాడేవు

చ. 1: నివ్వటివల్ల నీ నవ్వు నేఁడె నాతో వలెనా
       వువ్విళ్లూర రేపు గొంత వుండనీరాదా
       జవ్వనపువాఁడవు నీసరివారమా నేము
       దవ్వుల నుండి మొక్కితే దగ్గరఁ బిలిచేవూ

చ. 2: కోయ్య నా మాటలు నాకొరకె నేరిచితివా
       అయ్యో యీవేళకుఁ దగి నంతే చాలదా
       గయ్యాళించి నిన్ను నేమౌఁ గా దనేనటివారమా
       పయ్యద నే మూసుకొంటే పై నేల వొరగేవు

చ. 3: కన్నులసన్నలు నాకే గాదెఁ బోసు కుండితివా
       పన్ని పైఁడియమ్ము లిన్నీఁ బార వేసేవా
       యిన్నిటా శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
       మన్ననలు పొగడితె మర్మము లంటేవు