పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0383-5 భౌళి సంపుటం: 11-497

పల్లవి: కన్నుల నీ రాఁప లేక కాఁకలు నిలుప లేక
         పన్ని పెద్దయెలుఁ గెత్తి పాడితి నోయమ్మా

చ. 1: దగ్గరి వచ్చినవాని తడవి నేనే మన్నా
       అగ్గలము నావొళ్లిదె యౌ నేరమి
       వెగ్గళించ రాదు మరి వెనక తియ్యఁగ రాదు
       బగ్గనఁ బాదాలమీఁదఁ బడితి నోయమ్మా

చ. 2: చేయి మీఁద వేసేవాని చేఁత నే నేమి సేసినా
        నాయము గా దని మీరు నన్నే అందురు
        పోయినట్టె పోనీలేను పొంచి కొత్త సేయ లేను
        సేయ రాని వినయాలు చేసితి నోయమ్మా

చ. 3: వుమ్మడిఁ గాఁగిలించఁగ వోప నంటే అంతలోనే
        కిమ్ముల నాతఁడు నాకుఁ గిందు పడును
        నెమ్మది శ్రీవెంకటేశు నేనె మునుపఁ గూడి
        సమ్మతించి ఆనందమే చల్లితి నోయమ్మా