పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0383-4 ముఖారి సంపుటం: 11-496

పల్లవి: అన్నియు నీవల్ల నింతే సాయ నయ్యా
         నిన్న నేఁటనె యీ మేలు నిండె నయ్యా

చ. 1: సాదించి నేఁ డాపె నీసరిఁ గూచుండినది నీ
       పాదము సోఁకినయట్టి బలు వయ్యా
       ఆదికొని యిన్నా ళ్లాపె ఆపె గాదో నేఁ గాదో
       యీదెస మేరలు మీరి యిట్లనె వుంటిమా

చ. 2: యించు కంత పిన్నది నా కెదురు మాటాడె నిదే
       మించి నీ నవ్వినముందెమేళ మయ్య
       నించి వొక్కవూరనె నే లేనో ఆపె లేదో
       చంచు మీరి యింతేసి రచ్చలకు నెక్కుదుమా

చ. 3: తేరకొన నాపె నన్ను దిష్టించి చూచినది
       కోరి నీచేయి వేసినగఱ మయ్యా
       యీరీతి శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
       నేరువు నీ వల్లఁ గాక నే మొక్కటి అవుదుమా