పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0383-2 ముఖారి సంపుటం: 11-494

పల్లవి: అప్పటిఁ దా మంచివాఁడ ననుకొనును
         చెప్పరే బుద్దులు మీరు చెలులాల పతికి

చ. 1: మోము చూచితే నాకు మొగవమోట దరచూ
       దోమటి నాతని నే దూరఁ బొయ్యేనా
       గామిటిమాట లాడితే గబ్బి నందురు
       యేమి సేతు నమ్మలాల యెం దున్నాఁడో అతఁడు

చ. 2: గక్కనఁ గదిసితే కరఁగు నా చిత్తము
       మక్కువ నాతని నేను మట్టు పెట్టేనా
       చక్క నూర కుండితే రాజస మందురు
       దక్కితి నే నమ్మలాల తా నేడ నున్నాఁడే

చ. 3: సొలసి మా టాడితే చుట్టమ నే నౌదునూ
       కలసే శ్రీవెంకటేశుఁ గా దనేనా
       చలపట్టి మెచ్చఁ బోతే సట లందురు
       వలచితి నమ్మలాల వాఁడె నవ్వీ నదివో