పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0383-1 నారణి సంపుటం: 11-493

పల్లవి: తనిసినవాఁడు గాన తమి చాలదు దనకు
         పని లేదు తను నింక బడలించ నాకు

చ. 1: సరసమే ఘన మాయ సరి యేఁకలవల పాయ
       సరివొద్దు వోయ నింకాఁ జాల దటరే
       అరలోనఁ బవ్వళించు మనరే విభుని నేను
       పొరిఁ దూఁగుమంచానఁ బొరలేఁ గాని

చ. 2: పందెములే తఱ చాయ బయలీఁత సుద్దు లాయ
       చందమామగుటుకలు చాల దటరే
       కందువ నిద్ర రా కుంటె కతలు విను మనరే
       ముందర నేనే లోన మొక్కు చుండేఁ గాని

చ. 3: చల్లుఁజూపు లెక్కు డాయ జడివానరతు లాయ
       జల్లింపు వినయములు చాల దటరే
       యిల్లిదె శ్రీవెంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూఁడె
       యెల్లకాలమునుఁ దన్ను నెడ వాయఁ గాని