పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0382-6 సాళంగనాట సంపుటం: 11-492

పల్లవి: అగుగరే చెలులాల ఆతఁడు వాడే
         యెడసితే జంకింతుము యింత కోపీనా

చ. 1: చేతికి లో నౌదాఁకా జెప్పెటి ప్రియము లింతే
       ఆతలి మందెమేళాలె అదు కోపీనా
       కాతరపుదాన నేను ఘనుఁ డిన్నిటాఁ దాను
       యేతులు నెమ్మెలు మాని యింత కోపీనా

చ. 2: చనవు గలుగుదాఁకా సరవి నడచు నింతే
       వెనకపనులు మీరు వెట్ట కోపీనా
       మొకతోడిదాన నేను మొక్కలపుదొర దాను
       యెనసి మాతోడి జడ్డు కింత కోపీనా

చ. 3: కలసిన యందాఁక కన్నుల మొక్కుట యింతే
       బలుము లంతటి మీఁదిపని కోపీనా
       చెలి నింతే నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు దాను
       యెలయింపులరతుల కింత కోపీనా