పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0382-5 కన్నడగౌళ సంపుటం: 11-491

పల్లవి: మనోభావకుఁడవు మగువ మిక్కిలి జాణ
         అనేకవిన్నపము లందులోనే వున్నవి

చ. 1: వంచినరెప్పలవెంట వడిసిన కన్నీరు
       కొంచక నీమీఁదఁ జెలి గోరఁ జిమ్మీని
       యెంచి నీ విందాఁక రాక యింత నేసినయందుకు
       పొంచి నీకు నక్కునఁ బోసి చూప వలదా

చ. 2: సారె నాకొప్పువిరులు సరి నొక్కొక్కటే తీసి
       దార దప్పు కుండ నిన్నుఁ దాఁక వేసీ ని
       రా రమ్మనీ పిలువఁ బరా కై వుండినందుకు
       వూర కుండి తనపాటు వొప్పగించ వలదా

చ. 3: వెట్టఁ బొరలిన దై వెస నిన్నుఁ గాఁగిలించె
       అట్టె తన అసురుసు రదె చూపీని
       ఱట్టుగ శ్రీవెంకటేశ నెట్టనఁ గూడి తీడనె
       దిట్టయి నీసేసినమేలు దిగఁ బోయ వలదా