పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0382-4 శ్రీరాగం సంపుటం: 11-490

పల్లవి: చెప్పకున్న దోసమూ సేనినచేఁతలు నీతో
         చొప్పెత్తి పయ్యద గంటే సోదించక మానఁడు

చ. 1: రాఁడని నీతోఁ జెప్ప రాఁగా నీరమణుఁడు
       పోఁడిమి గాఁగిటఁ బెట్టెఁ బోకు మంటాను
       నాఁడె నీతోఁ జెప్పవా నన్ను నంపకు మనుచు
       ఆఁడ దైతేఁ జాలు నాతఁ డంటుకోక మానఁడు

చ. 2: నీపై నాన వెట్టఁ గానె నీవావి మీఁద వేసి
       చేపట్టి గిజిగిజిగాఁ జేసె నాతఁడు
       వోప నన్నాఁ బో నీక వూడిగాన కంపితిని
       యీపాటి సందు గలితే యెనయక మానఁడు

చ. 3: నే నట్టె పెనఁగఁ గాను నీమతకమే యంటా
       తానే కూడె శ్రీవెంకటోత్తముఁడు నన్ను
       మోనాన నూరకుండితి ముందు నిన్నుఁగూడుదాఁకా
       నానాటి కీపాటి నవ్వు నడపక మానఁడు