పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0382-3 భైరవి సంపుటం: 11-489

పల్లవి: ఇంక నేల కొంకఁ దమయిచ్చ లనరే
         అంకె నే నుంటేఁ దమ కే మాయ నడగరే

చ. 1: యేకత మాడెటి వేళ నేల నే వచ్చితినో
       దాకొని నన్నుఁ గంటానే తల వంచిరి
       యీకడఁ దమ కిద్దరి కెంత వెగ టైతినో
       రా కున్న నెట్టాయ నింత రచ్చల కెక్కితిని

చ. 2: మగఁడు నాలు నుండఁగ మంచ మే లెక్కితినో
        చిగురుమోవులఁ దాము సిగ్గు వడిరి
        సొగిసి యిద్దరి కెంత సుఖవిరుద్ద మైతినో
        మొగ మియ్య ననే రంటా ముందు నుందానను

చ. 3: యెనసినరతివేల నేల కాఁగిలించితివో
       తనిసి తమమేనులు తా మెఱుఁగరు
       అను వై శ్రీవెంకటేశుఁ డప్పటిని నన్నుఁ గూడె
       ఘనగర్వ మనే రంటాం గాని మ్మని యంటిని