పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0382-1 ఛాయనాట సంపుటం: 11-487

పల్లవి: వేసాల నేఁడు నాకుఁగా వెరవ నేల
         వాసి యాపె కెక్కించఁగా వద్దనేనా యిపుడు

చ. 1: చాయలు చూచి చూచి సణఁగులు చల్లి చల్లి
       ఆయెడనే నిలుచున్న దప్పటనుండి
       చేయి మీఁది వేసి యాపె జెంగటఁ గూచుండు మంటే
       యీయెడఁ దా వచ్చినా నే లనేనా నేను

చ. 2: వెంగెములే యాడి యాడి వెరగులే నించి నించి
       కంగి నిలుచున్న దదే కంబముదండ
       సంగడి నీవు నిలిచి చన విచ్చి వేఁడుకొంటే
       సింగారము నేఁడు గాదా సిగ్గయ్యినా నీకు

చ. 3: పొందు లట్టె చేసి చేసి బొమ్మలట్టే వంచి వంచి
       కందువ శ్రీవెంకటేశ కరఁగీ నదే
       యిందు నందుఁ దిరిగాడి యిద్దరిఁ గూడితి విట్టే
       ముందరనే యిట్టైతే మొరఁగి నవ్వేనా