పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-6 సామంతం సంపుటం: 11-486

పల్లవి: అంతటఁ గాని తీరదు ఆపెనే చేరి
         చెంత లోనికి రమ్మని చే వట్టి తియ్యవయ్యా

చ. 1: యిచ్చగించి నీవు నాపె యేకతము లాడఁ గాను
       వచ్చి వచ్చి నిలిచెను వాకటిఁ జెలి
       తుచ్చము లాడక తొల్లె తొయ్యలిచే మొక్కించి
       మచ్చికగాఁ గిందుపడి మాట లాడవయ్యా

చ. 2: చేచేతమీ రిద్దరును సెలవుల నవ్వఁ గాను
       చూచి చూచి తలవంచి సోలగిలీని
       యేచి కోపించకతొల్లె యింతిచే సేవ సేయించి
       తాచి నీకాఁగిట నీవు తమి రేఁచవయ్యా

చ. 3: మంచముపై నీవు నాపె మలయఁగా ముట్టి ముట్టి
       అంచునఁ దా బవ్వళించి అంగవించును
       అంచెల శ్రీవెంకటేశ అంతలోఁ గూడితి వాపె
       కంచముపొత్తు గలపి కరగించవయ్యా