పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-3 సామంతం సంపుటం: 11-483

పల్లవి: అందాఁకాఁ గాఁగిన నిన్ను నన రాదు గా
         పొందిక లైన మీఁద బుద్ది చెప్పేఁ గాని

చ. 1: వేడుక నీ రమణుఁడు విచ్చేసుదాఁకా నీ
       వాడిన ట్టెల్లా మాకు నాడ వలెఁ గా
       యీడుగా సమరితి మి మ్మిద్దరిఁ గూడఁగఁ జేసి
       జోడుగా నీతిట్లకు సూడు వట్టెఁ గాని

చ. 2: పక్కన మీలోన మొకబంగారు వాసినదాఁకా
       వెక్కసపు నీసణఁగు వినవలెగా
       చిక్కు వడ్డ మీలోని చిత్తము లేకము సేసి
       దక్కిన నీచేఁత లెల్లాఁ దగఁ దిప్పేఁ గాని

చ. 3: యీకడ నాతఁడు నిన్ను యిట్టె మన్నించినదాఁకా
       నాకు నాకే నిన్నుఁ జూచి నవ్వవలెఁ గా
       చేకొని యింతలోనె యాశ్రీవెంకటేశుఁడు గూడె
       సాకిరి దెలిపి మీద సమ్మతించేఁ గాని