పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0381-2 కాంబోది సంపుటం: 11-482

పల్లవి: ఉన్న వల్లా నటుండనీ వొద్ద నిలుచుండనీ
         కన్నులకు నిధానము గలిగెఁ గా నీకు

చ. 1: యేపొద్దు నాపె నీవు యెదఁ గట్టుకొ నుండఁగ
       తీపుల నీపాలిటి దేవ రాయఁగా
       యీపాటి వారి వీరి నెలయించి యీసు రేఁచ
       కాపాడి చెప్పి చూపఁ గలిగెఁ గా నీకు

చ. 2: చేతికి లో నై యాపె చెప్పినట్టె సేసేవు
       యీతల నిన్ను వంచుకో నేలి కాయఁగా
       రీతిగా సింగారించి రేయిఁ బగలుఁ దాలార్చ
       ఘాతల సింగారబొమ్మ గలిగెఁ గా నీకూ

చ. 3: చీ మంత మా టైన చెవిలో నీకు బోదించు
       కోమలి నీ కిన్నాళ్లను గురు తాయఁగా
       యీ మేర శ్రీవెంకటేశ యిద్దరి మమ్ముఁ గూడితి
       కామించి మేకులు సేయఁ గలిగెఁ గా నీకు