పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-6 సౌరాష్ట్రం సంపుటం: 11-480

పల్లవి: నీమనసులోనిమాట నే నెరఁగనా
         కామించి నీవే నాకుఁ గల వని వుందునూ

చ. 1: నాకే వలతు వంటా నాపై బత్తి గల వంటా
       ఆక డీకడివారితో నాడుకొందును
       యీకడ నన్ను మన్నించి యింటి కిట్టె వచ్చే వంటా
       తూకొని నీరాకల కెదురు చూతును

చ. 2: నమ్మఁగలవాఁడ వంటా నామాట గడవ వంటా
       కమ్మిని నిన్నే పొద్దునుఁ బొగడుచుందునూ
       రమ్మని నిన్నుఁ బిలిచి రతుల మెప్పించే నంటా
       నెమ్మది నుపాయములు నేరుచుకుండుదును

చ. 3: యిద్దరము నొక్క టంటా నెగ్గు దప్పు లెంచ వంటా
       పెద్దరికమున సరి పెనఁగుదును
       అద్దివో శ్రీవెంకటేశ అట్టె కా నన్నుఁ గూడితి
       పొద్దు వొద్దు నీకు నిట్టె బోదింతునూ