పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0380-2 శుద్దవసంతం సంపుటం: 11-476

పల్లవి: ఏల వేగిరించీనె తా నింతలోనను
         జాలితోఁ బవ్వళించి మంచముపై నుందానను

చ. 1: తెల్లవార నియ్యవే తేనె లుట్టిపడేఅట్టు
       మల్లాడి తనతో నేను మాటాడేఁ గాని
       యిల్లు గడె వెట్టుకొంటి నీపొద్దుకు నోప లేను
       పల్లదాన నిదివో నా పక్క బిడ్డ వున్నది

చ. 2: చలి వాయ నియ్యరే సరి బేసి ఆడినట్టు
       వలపులు తనమీఁద వడిఁ జల్లేను
       తలఁ బట్టు వెట్టుకొంటిఁ దతి గా దీవేళను
       పొలసి మాయత్త నేఁడు పొరుగింట నున్నది

చ. 3: చేగ చేర నియ్యవే చెల్లుబడి గలయట్టు
       బాగులుగా తన్ను నేనె పైకొనేను
       చేగడియ దీసి చొచ్చి శ్రీవెంకటేశుఁడు గూడె
       వేగిరించి మావదినె వెలుపల నున్నది