పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0379-6 శంకరాభరణం సంపుటం: 11-474

పల్లవి: నీకు నిచ్చకమే నెరపుదుఁ గా కిటు
         కాకు సేసి నినుఁ గదిమేనా

చ. 1: యెమ్మెకు నాతో నెంత నవ్వినా
       కిమ్ముల నాతోఁ గిని సేనా
       నిమ్మపంటఁ గొని నీవెంత వేసిన
       ముమ్మాటికి నే ములిగేనా

చ. 2: తొడిఁబడ నీవే తురుము వట్టితే
       బెడిదంబుగ నేఁ బెనఁగేనా
       అడరి నీవు రమ్మని ననుఁ బిలువఁగ
       వోడకఁ బండ నని వొదిగేనా

చ. 3: పైకొని నీవే పాదము చాఁచగ
       చేకొని పిసుకక సెలసేనా
       యీకడ శ్రీవెంకటేశ్వర కూడితివి
       యేకడ కేఁగఁగ నిచ్చేనా