పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0379-5 శ్రీరాగం సంపుటం: 11-473

పల్లవి: నాకొర కంటినా నీ నాటకాన కంటిఁ గాక
         యీకడ నాకు మొక్కే వేఁటి కింతే సానలు

చ. 1: చిత్తజకేలికి నీవు చేర వైతి వంటినా
       హత్తి నీ వెందో వుంటి వంటిఁ గాకా
       పొత్తుకు రావలసి నేఁ బోరి యింతే సంటినా
       అత్తలివారిపొత్తు లరసితిఁ గాకా

చ. 2: వుంగరము నాకు నీవు వుంకువ యిమ్మంటినా
       అంగడి నెవ్వతె యిచ్చె నంటిఁ గాకా
       కంగి నాతో నీ విట్టె వల్ల లాడే వంటినా
       అంగనతో నే మని యంటి వంటిఁ గాకా

చ. 3: నావద్దనె వుండు మని నమ్మక నే నంటినా
       ఆవలివారు నిం దాడే రంటిఁ గాకా
       శ్రీవెంకటేశుఁడ నన్ను చేకొని కూడితి విట్టె
       భావరితి నాపెనుఁ జెప్పకు మంటిఁ గాకా