పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0379-4 మాళవిగౌళ సంపుటం: 11-472

పల్లవి: ఊరకె ని న్నింత సేసి వుప్పటించేనా
         తేరె నన్నిపనులు నిందె మొక్కే రావయ్యా

చ. 1: కప్పురవిడెము నీవు కాంతచేత నుందుకోఁగా
       దెప్పరపుకోపమునఁ దిట్టితిఁ గాక
       నెప్పున నాపెసొమ్ములు నీమేన నుండఁ గాను
       అప్పుడె నాతో నేను అలిగితిఁ గాకా

చ. 2: ముసిముసి నవ్వులతో ముదితమోము చూడఁగా
       వెసఁ బూవుబంతిఁ గొని వేసితిఁ గాకా
       వసమై యాపె నీతో వట్టిసన్నలు సేయఁగ
       యిసు మంత నిన్ను నేర మెంచితిఁ గాకా

చ. 3: గట్టిగా నీ వాసతి కాఁగిట నుండఁగాఁ జూచి
       చిట్టకానకుఁ బాదానఁ జిమ్మితిఁ గాకా
      నెట్టన శ్రీవెంకటేశ నీవే నన్నుఁ గూడితివి
      గుట్టున నన్నిటా నిన్నే కొసరితిఁ గాకా