పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0379-3 సాళంగం సంపుటం: 11-471

పల్లవి: అంతటఁ గాని తీర దతివమతి కోపము
         యెంత దలపోసినా యిదివో నాయకుఁడా

చ. 1: యిప్పుడైనా నామాట కియ్యకొంటేఁ జాలుఁ గాక
       తప్పి పోయినా వలపు తతి మీరీనా
       చెప్పనా నీ కప్పుడే సేసిననేరాన కెల్ల
       ముప్పిరి నాపె నీపెకు మొక్కించు మని

చ. 2: వెనకటి నీచలము విడిచితేఁ జాలుఁ గాక
       అనువుగఁ జేయ లేమా అన్నిపనులు
       విన వైతి వింతే కాక వేగమే యెచ్చరించనా
       చెనకిన ఆపె నీపెచేతి కిమ్మని

చ. 3: ప్రేమానఁ దగవు నడుపే నంటేఁ జాలుఁ గాక
       యీమగువమారుగ నే నియ్యకొననా
       కామించి శ్రీవెంకటేశ కలసితి వౌ నననా
       సామాన నాపె నీపెను సరిగాఁ జేయు మని