పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0379-1 రామక్రియ సంపుటం: 11-469

పల్లవి: ఎఱకముడి విశ్వాశ మిఁక నేలా
         నెఱి నిటమీఁదికీర్తి నీదే కాకా

చ. 1: నీవే నే నై యుండఁగాను నిన్ను దూరఁ జో టేది
       కావలసినపనులు గనుటే కాకా
       ఆవల మారుమాట లడుగఁగఁ జో టేది
       వేవేలు సుద్దులెల్ల వినుటే కాకా

చ. 2: మనసు లొక్క టైయుండి మచ్చరించఁజో టేది
       ననుపున నెందు కైన నగుట గాక
       చనవులు గలిగియు సాదించఁ జో టేది
       వొనరినసంతసాన నుండుటే కాకా

చ. 3: నిండుఁ గాఁగిటనే వుండి నీతోఁ గొంకఁ జో టేది
       అండనే మనము వెర గందుట గాకా
       కొండల శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
       మెండుగా నిన్నిటా నేను మెచ్చు టింతే కాకా