పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-6 రామక్రియ సంపుటం: 11-468

పల్లవి: ఎంత బలువె తన కెంత నేము సదరమా
         అంతే పో తనసుద్దు లవి నే మెరఁగమా

చ. 1: రమ్మని చేరఁ బిలిచీ రా కున్నఁ దనచేతి
       నిమ్మపంటఁ గొని వేసీనే నన్నును
       కమ్మటిఁ దప్పక చూచీ కడు నేఁ దల వంచితే
       అమ్మ మీఁదఁ దిట్టీనే అంతలోనె తానూ

చ. 2: చేయి చాఁచీ నామీఁద సిగ్గున నూర కుండితే
       చాయలకుఁ బన్నీరు చల్లీనె వీఁడూ
       ఆయములు దా నంటఁగ నందుకు నేఁబెనఁగితే
       బాయిట వొట్టు వెట్టీనే పాయ లేక తానూ

చ. 3: కొంగు వట్టి తియ్యఁగాను గుట్టున నే నవ్వితేను
        అంగవించి యట్టె కూడె నందుకే తానూ
        యింగితము శ్రీవెంకటేశుఁ డితఁడే యెఱంగు
        చెంగట నన్నిటికిని చెక్కు నొక్కీఁ దానూ