పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-5 శంకరాభరణం సంపుటం: 11-467

పల్లవి: దొరపాటివాఁడు తాన దొరరీతి నుండఁడు
         వరుసలు మిరి వచ్చీ వద్దనరే చెలులూ

చ. 1: అంది నాకు బాగా లిచ్చి ఆకు మడి చిచ్చె నంటా
       విందువలె నితఁ డేల వేఁడుకొనీనే
       యెందు నూడిగపువార మింతే తనకు నేము
       మందెమేళములు సేసీ మాను మన్న మానుఁడ

చ. 2: సరిఁ దానిలుచుండి మంచముపైఁ గూచుండుమంటా
       అరుదుగ నన్ను నేల ఆన వెట్టినే
       సరుసఁ దనకొలవుసతుల మింతే నేము
       వెరవులు చెప్ప వచ్చీ వీఁడి దేమే నేఁడు

చ. 3: తల గుచ్చి కాఁగిలించి తమ్ముల మిడు మంటాను
       బలిమి నేసి పెనఁగీ పచ్చిగాఁ దానూ
       యిల శ్రీవెంకటేశుఁడు యిచ్చలోనివార మింతే
       చాలి వాసి మమ్ముఁ గూడె చన వింత గలదా