పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-4 హిందోళం సంపుటం: 11-466

పల్లవి: వెనక మమ్మన వద్దు వెతలఁ బొరల వద్దు
         అనుమాన మెల్లఁ దీరె నరుసుకోవమ్మా

చ. 1: తలఁచఁగానె వచ్చె తరుణి నీరమణుఁడు
       అలరి మీమచ్చటలు ఆడుకోరమ్మా
       నిలుచున్నాఁ డదివో నీయెదుట నతఁడు
       తెలియఁగల వెల్లాను తెలుసుకోవమ్మా

చ. 2: చేతికి లో నై యున్నాఁడు చిల్లరచేఁతలు మేన
       ఘాతలుగ లేవు గదా కనుకోవమ్మా
       యేతుల నీ చెప్పినట్టు యేమి సేయు మన్నాఁ జేసీ
       యీతల నొరసి చూడు మింకా నోయమ్మా

చ. 3: గక్కనఁ బ్రేమ మెరిఁగి‌ కాఁగిలించినాఁ డిదివో
       మిక్కిలి శ్రీవెంకటేశు మెచ్చవమ్మా
       నిక్కి యీతనిగుణాలు నీ వెరఁగ వలసితే
       చెక్కు నొక్కి బుజ్జగించి చిత్తగించవమ్మా