పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-3 ఆహిరి సంపుటం: 11-465

పల్లవి: ఎవ్వరికిఁ దెలుసు నీ యిట్టి మాయలు
         రవ్వలుగాఁ జూడఁ బోతే రంటికిని వత్తువూ

చ. 1: నగవులు సారె నీకు నవ్వ వచ్చుఁ గాక మాకు
       పగ సవతులచేతఁ బడ వచ్చునా
       పగలుమేలము చాలు పద వోయి నీ కేమి
       తగులువిరికాఁడవు దక్కినట్టే వుందువూ

చ. 2: చేఁత లెల్లఁ జేసి నీకుఁ జెక్కు నొక్క వచ్చుఁగాక
       బాఁతిపడి విరహనఁ బడఁ గలమా
       లేఁతమాట లాడ వద్దు లేవోయి వలపులు
       పాఁతగిలితేఁ జాలు పనులే మరతువూ

చ. 3: గతి గూడి నీకు మమ్ముఁ గాఁగిలించ వచ్చుఁ గాక
       అతివలయు నిన్ను రమ్మన నోపేమా
       సతమై శ్రీవెంకటేశ చన విచ్చి కూడితివి
       యిత వయినచోటికి నీ వెట్టయినఁ జేతువూ