పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0378-2 రీతిగౌళ సంపుటం: 11-464

పల్లవి: నిజమే యాడుచు గాక నీ కేల యీవెరపు
         గజిబిజి నేసి నిన్ను గాసిఁ బెట్టేనా

చ. 1: మాఁట లాడుటే గురుతు మంచముపై నాపె నీవు
       నాటినకూరిమి మించునవ్వులతోడ
       యేఁటికి నాతో బొంకే వేసుద్ది నెరఁగ నంటా
       ఆఁటదాన నిన్ను నే నే మైనాఁ జేసేనా

చ. 2: చేయి వట్టుటే గురుతు సిగ్గుపడి యున్నచెలి
        చాయకుఁ దీసీ నది పూఁజప్పరములో
        మాయ లేల నెరపేవు మగువ నింతే నేను
        దాయవలె నీతోడఁ దగఁ బోరేనా

చ. 3: చెక్కు నొక్కుటే గురుతు చెలి నీవు మేడమీఁద
        నెక్కడి యానలు నాతో నేల పెట్టేవు
        యిక్కడ శ్రీవెంకటేశ యేలితివి నన్ను నేఁడు
        పక్కన లే కున్న నిన్ను బలిమి సేసేనా