పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-6 రామక్రియ సంపుటం: 11-462

పల్లవి: అడుగరే చెలులాల ఆతనినే యీమాఁట
         తడవి నే మెవ్వ రైన తన్ను మీరేమా

చ. 1: చదురంగ మాడి యాడి సరిఁ దానె వోడె నింతే
       వొదిగి తనకు నసు రుసురేలే
       మొదల నేఁ డెవ్వతెకు మొగము చూపి వచ్చెనో
       యెదుట నున్నరా రెల్ల నేమి సేతురే

చ. 2: వసంతము లాడ వచ్చి వడిఁ దానె తొప్పఁ దోఁగె
       వసివాడి తానె తల వంచ నేలే
       దెసల నెవ్వతెచేతి తిట్టు దాఁకి తా వచ్చెనో
       యెసఁగి నవ్వేవా రెల్ల నేమి సేతురే

చ. 3: సరస మాడె తనకు సరి నింద మోఁచె నింతే
       దరలోన సిగ్గుపడ దన కేలె
       యిర వైన శ్రీవెంకటేశుడె తా నన్నుఁ గూడె
       యెరవులవా రెల్ల నేమి సేతరే