పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-5 సామంతం సంపుటం: 11-461

పల్లవి: వాఁడి గలవాఁడ వౌత వడి నే మెఱుఁగుదుము
         వేఁడిమి దుష్ణులమీఁద విసరంగ రాదా

చ. 1: వోప నంటాఁ బెనఁగితే నుడికి తిట్ట వచ్చేవు
       ఆపనికే యెంత కెంత ఔరా నీవు
       కోపము గలిగితేను గురిఁ బగవారిమీఁదఁ
       జూప రాదా యీడ నేల చూపేవు నీవు

చ. 2: తనిసినవారిమీఁదఁ దగఁ జేతులు చాఁచేవు
       యెన లేనికాఁకతోడ నేరానీవు
       మొన చూప వలసితే ముంచి నీకు నెదిరించి
       చెనకెటివారపైనే చేఁత సేయ రాదా

చ. 3: పొలసి నంతటిలోనె పొదిగి నన్నుఁ గూడితి
       మెలుపు శ్రీవెంకటేశ మేలురా నీవు
       బలిమి నీకుఁ గలితే పౌఁజులమీఁద నురికి
       వలసినట్టు మెరయ వద్దనేనా నేను