పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-3 సాళంగం సంపుటం: 11-459

పల్లవి: ఏల తిట్టేవే నన్ను నెంత గబ్బిదాననే
         మే లని పొగడితేను మెచ్చ వద్దా నీవూ

చ. 1: చిక్కని వెన్నెలతేట సెలవినె వుండఁ గాను
       చక్కని నీ మోమునె చంద్రుడు డంటినే
       నిక్కి నిక్కి మూతు లెత్తి నీ మొగాన కెగరఁగా
       జక్కవపిట్టలు నీ చన్ను లంటినే

చ. 2: కామించి మురిపెముతోఁ గదలుచు నుండఁ గాను
       రామ నీపిరుఁదు మరురథ మంటినే
       కోమలపుఁ బోలికలు గురుతులు చూపఁ గాను
       తామెరలనె పాదాలు తగ నంటివే

చ. 3: జాతిమెఱుఁగులతోడ సరివచ్చి వుండఁగాను
       నీతురుమె రాశి యైల నీలా లంటినే
       నీతితో నన్నుఁ గూడితి నేను శ్రీవెంకటేశుఁడ
       నీతనువె బంగారునెల వంటినే