పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-2 ముఖారి సంపుటం: 11-458

పల్లవి: అయ్యేపను లేవిధాన నయ్యీఁ గాక
         చెయ్యారఁ జేసేపనికి సిగ్గు లిఁక నేలా

చ. 1: పంతము లాడఁగ నేలే బలువులతోడను
       చింతతో చెక్కిటిచేతి శిబ్బితె మేలు
       చెంతలఁ బెనఁగఁ బోతే చేకత్తిగోళ్లే తాఁకు
       నంతేసి లోఁతుల చొర నాఁడువారి కేలా

చ. 2: కోరి నేరా లెంచ నేలే కొయ్యగాండ్లకుతోడ
       వోరుచు కుంటే టస్సు రుసురే మేలు
       యేరీతిఁ దమి రేఁచిన నీరు దియ్యఁ బేను వచ్చు
       బారపుబండ్లకుఁ గాళ్లు పైం జాఁచ నేలే

చ. 3: కడుఁ గడు నవ్వు లేలే కాములకులతోడను
       చిడుముడిఁ జేసెటిసేవలే మేలు
       అడరి శ్రీవెంకటేశుఁ డాతడే నన్నుఁ గూడె
       విడువనిపొందులకు విచారము లేలే