పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0377-1 సాళంగం సంపుటం: 11-457

పల్లవి: ఏ మయ్యా వో యయ్య వే మయ్యా నే
         మేమి బాఁతి నీకు నేల పిలిచే వయ్యా

చ. 1: నీ సరివారమా నేము నిండు సరసము లాడ
       ఆసలఁ బెట్టక మాను మన్నామానవు
       కాసు సేయనిపనికి కమ్మటి నాన వెట్టేవు
       వేసరక నీవు మావెంట వెంటఁ బాయవు

చ. 2: చనవరులమా నేము సంగడి నీతోఁ గూచుండ
       పొనిగి వోయినసుద్ది పో నియ్వవు
       ననిచినవావు లెల్ల నాటికి నాఁడే కాక
      కొనవేసి మమ్ము నేల కూరిమి గొసరేవు

చ. 3: నిన్ను మీరెవారమా నేఁ డేమి సేసినాను
       కన్నులఁ దప్పక చూచి కలసితివి
       యిన్నిటా శ్రీవెంకటేశ యిందరు నిట్టై చూడఁగ
       నన్ను మన్నించి నాతోనె నవ్వులు నవ్వేవు