పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-5 సామంతం సంపుటం: 11-455

పల్లవి: ఎటువంటి నీ మాయ యెరంగమురా
         యిటువంటి చేఁతలనే యెడ్డ నైతిరా

చ. 1: నగఁ బోతే నీ చేతి నాలికి లో నయితిమి
       అగ డాయ మావలపు లట్టే వుండరా
       మొగము చూడఁగఁ బోతే ముంచుకొనె మోహ మెల్ల
       యగసక్కెములకే యేమి సేతురా

చ. 2: మాఁట లాడఁ బోయి నీతో మంతనాలఁ జిక్కితిమి
        యేఁటికి మమ్ముఁ జెనకే వేడ సుద్దిరా
        మేఁటినిన్న మెచ్చఁ బోయి మేనవాని చుట్టుకొంటే
        యేఁట వెట్టీఁ దమకము యేమి సేతురా

చ. 3: కరఁగించఁ బోయి నీ కాఁగిట నేఁ గూడితి
        యిర వాయ వయసు నవ్విఁక నేలరా
       సరవి శ్రీవెంకటేశ సమ్మటూరిలో మనము
       యెరవు లేని యీమేలు కేమి సేతురా