పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0376-1 నాదరామక్రియ సంపుటం: 11-451

పల్లవి: ఆఱడిం బెట్టకు మమ్ము నప్పటి నీవు
         ఆణ నీవు నా కోపము అప్పటి నీవూ

చ. 1: మందు మందె సోఁక నాడి మొరఁగి లే దనేపతి
       కందాలు చెప్ప వచ్చేవు అప్పటి నీవు
       సందె మాడి వోడి తానె పగ చాటీ లోలోన
       అందు కేల నవ్వేనే అప్పటి నీవు

చ. 2: సంగతి గానిచేఁతలు సారెఁ జేసినట్టివాని
       నంగవించి కూడు మనే వప్పటి నీవు
       ముంగిట వాఁడుండఁ గాను మొక్కి మొక్కిమావలపె
       అంగడి వేసేవు మేలే అప్పటి నీవు

చ. 3: యింటికి నాతనిఁ దెచ్చి యిట్టె కాఁగిలించు మంటా
       అంటించేవు బటిమినే అప్పటి‌ నీవు
       దంట శ్రీవెంకటేశుఁడు తానె కలసె నీమాఁట
       కంటే నన రాదు మొక్కే వప్పటి నీవూ