పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-6 లలిత సంపుటం: 11-450

పల్లవి: కంటి మిన్నాళ్లకు గక్కన దొంగను
         అంటె నోర నదే అంగమచ్చము

చ. 1: వుట్టు లెక్కినాఁ డొక్క తొక్కతె
       తిట్టఁ దిట్ట వాని దిగఁ బిలవరే
       గుట్టుఁ గృష్ణునికి గొల్లెతలకును
       యెట్టు గావలసి నట్టయ్యీఁ గాని

చ. 2: మూల నున్నాఁ డదె ముంగిటికిఁ దీసి
       రోలఁ గట్టరే రోస మెల్లఁ దీర
       నీలవర్ణునితో నేఁడు మనబలి
       మేలాగున నైన నెక్కీఁ గాని

చ. 3: మంచముపై వాఁడె మన మిందరము
        కొంచక వొక్కొక్కగురుతు నేయరే
        యెంచఁగ శ్రీవెంకటేశునకు మనకు
        నంచెఁ బొందు లాయ నట్టే కాని