పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-5 సాళంగం సంపుటం: 11-449

పల్లవి: పిండికూరలోనలుపులునేఁబెనఁగి యేరఁగ నోపతన్ను
         చండి సేయఁగ రాదు యిఁకసరుగఁగూచుండుమనవేయమ్మా

చ. 1: వేగి మిలిచినచీఁకటి వీఁడేల తడవీ మమ్ము
       ఆగడము రాతి రెల్ల సతులు ఆడఁ జేయట చాలదా
       యీగతులు నేనెఱఁగనా మరియు యేల రేఁచీమమ్మును
       జాగులన్నియును యిఁకచాలుఁ గూచుండుమనరేయమ్మా

చ. 2: పూస గుచ్చినదారము పోనీఁడు తా నన్నును
       వాసితో వీరి వారి వెనువెంట వలలఁ దిరుగుట చాలదా
       సేసినవి తా నెరఁగఁడా చెప్పఁ బోతే నవ్వులు
       ఆసఁ దన కెపుడుగలదూ యిఁక నాయఁగూచుండుమనరేయమ్మా

చ. 3: పూవుల పూఁపలువలెనె పొసఁగఁ దా నన్నుఁ గూడె
       భావమున తలఁచి తలఁచి కూడెటిభావరతులెచాలదా
       సేవ లెల్లనుఁ జేసితి నేఁడు శ్రీవెంకటేశ్వరునికి
       యీవేళ నేఁ దనిసితి యెపుడు నిట్లఁ గూచుండు మనరేయమ్మా