పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-4 సామంతం సంపుటం: 11-448

పల్లవి: అడ్డ మాడకు వమ్మ నీ వాతనితోను
         వొడ్డార మతఁడు నీతో నొనరించీనా

చ. 1: మూలలకుఁ బోకు వమ్మ ముంచి యాతఁడు రాఁగాను
       యీలాగు దొరచిత్త మెట్టుండునో
       బాలకివి నీ విపుడు ప్రౌఢనాయకుఁ డతఁడు
       తాలిమి నీయడకుఁ దప్పి నేసినా

చ. 2: సిగ్గులు వడకు వమ్మ చెనకి యాతనితోను
       నిగ్గులమగవాఁడు యేనెప మొంచునో
       అగ్గలపు మేనదాన వతఁడు మోహపువాఁడు
       యెగ్గలు నీ కొనరించి యెలయించీనా

చ. 3: పక్కన నవ్వకు మమ్మ పట్టి యాతఁడు గూడఁగ
       యెక్కువ శ్రీవెంకటేశుఁ డెంత సేసునో
       మిక్కిలి వాసికత్తెవు మించి వోరుచు నాతఁడు
       వొక్క టైతి రిఁక నీపై నోల వేసీనా