పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-3 నాగవరాళి సంపుటం: 11-447

పల్లవి: వలవు రచ్చల వేసేవారు గలరా
         కులమునాండ్ల నింత గోర నేయ వలెనా

చ. 1: నేరుపునఁ గళ లంటి నివ్వెరగుఁ బొందించేవు
       వీరు వారుఁ జూచి నన్ను వెఱ్ఱి యనరా
       వూర కున్న నామీఁద వొక్కొక్క గురుతు సేసి
       ఆరయ నిదెంత చిత్తి ణనిపించ వలెనా

చ. 2: చేతిమీఁద జేయి వేసి చెమరింపించేవు మేను
        ఆతలివారు చూచి నన్నట్టె నవ్వరా
        కాతరపుమాట లాడి కన్నులకెం పెక్కించేవు
        యీతరుణిమదరాగ మిది యెమ్మె లనరా

చ. 3: రతి నేసి తెర దీసి రామలఁ బిలిపించేవు
       అతివె లి దెంత పచ్చి యనరా నన్ను
       గతిగా శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
       యితవరి యిది యెంత యిచ్చకురా లనరా