పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0375-2 సాళంగనాట సంపుటం: 11-446

పల్లవి: దగ దొట్టి వుస్సు రనీఁ దన కేలే
         మగఁడే యింత సేసితో మరి యేఁటి మాఁటలే

చ. 1: ముప్పిరి నాపె కంటేఁ దాముందై వాదుకు రాఁగ
       యిప్పుడుఁ గోపము రాక యింకా నెన్నఁడే
       చప్పఁగా నప్పటిఁ దానే సాకిరులు చెప్ప వచ్చీ
       కుప్పలుగా నవ్వ కెట్టు గుట్టు చేసుకొందునే

చ. 2: సారెకు నాకెకుఁ గా బాసలు దానే సేయ రాఁగా
       యీరు దియ్యఁ బేను రాక యేల మానువే
       పోరిచ యెందు కైనాఁ దాఁ బూసుక వాసుక రాఁగా
       దూరక దైవముల నేల తోసిపో నిత్తునే

చ. 3: చెంది మ మ్మిందది దానె చెక్కులు నొక్కఁగ రాఁగా
       యిందరితోఁ జెప్పక నే నేల మానేనె
       కందువ శ్రీవెంకటాద్రిఘనుఁ డట్టె నన్నుఁ గూడె
       చందమే కాక నే నెట్టు చలము సాదింతునే