పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0374-5 భవుళి సంపుటం: 11-443

పల్లవి: తఱవాతిమాఁట లెల్ల దయ్య మెఱుఁగు
         యెఱఁగనిదాన నేను యే మందు నేనూ

చ. 1: మంతనము లాడుకొంటా మంచముపైఁ గేరుకొంటా
       నింతదడవు నుండరా యిద్దరు మీరు
       యింతలో నే రాఁగాను యెవ్వ రాపె యీ పెంటా
       యెంత కెంత నన్నడిగే వే మందు నేను

చ. 2: అంగము లొరసుకొంటా నాకు మడి చిచ్చుకొంటా
       యెంగిలి పొత్తందుకోరా యిద్దరు మీరు
       సంగడి నేఁ గూచుండఁగా సతి నా చెలి యనుచు
       యింగితానఁ బే రడిగే వే మందు నేను

చ. 3: కమ్మి కాఁగించుకోంటా కాయాలు మరచుకొంటా
       యిమ్ములఁ గూడి యుండరా యిద్దరు మీరు
       పమ్మి నే దగ్గరఁ గాను పైకొని నన్నుఁ గూడితి
       వెమ్మెల శ్రీవెంకటేశ యే మందు నేను