పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0374-4 భవుళి సంపుటం: 11-442

పల్లవి: చిత్తగించి చూడవయ్య చిగురుఁ బోఁడిదిక్కు
         బత్తి నీవు గల దాపెభాగయ్యముకొలఁ దయ్యా

చ. 1: చెలిచెమటల నాని చిత్తములో వలపులు
       పులక లై మొలచెను బుజ కలిగే
       యెలమిఁ గోరికె లై యీరికె లెత్తె నవే
       బలుపంట లిక నీభాగ్యముకొలఁ దయ్యా

చ. 2: అంగనవిరహవేళ నాయిటిగా లై వూర్పు
       వెంగలితనాన నట్టె విసరఁ జొచ్చె
       పొంగుచుఁ దూరు పెత్తంగఁ బొలివారె నివ్వెరగు
       పంగులఁ గోరు వట్టు నీభాగయ్యకొలఁ దయ్యా

చ. 3: కామినికుచము లనేగాదలెను జవ్వనము
       ఆమనికాలము ఫై పై నదె ముంచెను
       చే ముంచి కూడితి విట్టె శ్రీవెంకటేశ యీపెను
       భామకు నీకు రతులు భాగ్యముకొలఁ దయ్యా