పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0374-3 సామంతం సంపుటం: 11-441

పల్లవి: తనకును నాకునుఁ దగు లేదే
         పెనఁగి పిలవనిపేరట మిపుడూ

చ. 1: దవ్వుల నాతఁడు దప్పక చూచీ
       నెవ్వరి మనసున నె టుండునో
       నవ్వ కుండినా నన్నుఁ బెడరేఁచీ
       చివ్వన నా కిది సిబ్బితి గాదా

చ. 2: కోపగించినాఁ గొంగులు వట్టీ
       యీపెకు నితని కే మనరా
       మాపుదాఁకా నిదె మాటలె యాడీ
       ఆపని మీతో నన సంగతులా

చ. 3: కడు నాన లిడఁగఁ గాఁగిట నించెను
       వెడ వెడ గుట్టింక వెలిఁ బడదా
       బడి శ్రీవెంకటపతి యిదె తిరిగీ
       నిడువుల నిందలు నిజమే కాదా