పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0374-2 లలిత సంపుటం: 11-440

పల్లవి: ఈకాలం బెవ్వరి కైన యిచ్చకమే మేలు
         మీకేఁటికి నిష్ణూరంబులు మితిఁ దానె బుద్దియెరిఁగీని

చ. 1: నగ నేలే చెలులాలా నటనల మీలోను
       అడపడి నేఁ డతఁ డేమని నట్టె అవు ననరే
       తెగనాడ వల దింకా తెలిపి చెప్ప నేలా
       మొగమోటమినె వుందము మనముందరఁ దానె యెరిఁగీని

చ. 2: కడుఁ గడుఁ దప్పక చూడకురే కపటము దగిలీని
       జడిగొని ఆతఁడు యెంత సేసినా సారెఁ బొగడ గదరే
       తడవఁగ వల దింకా తరి గా దీవేళ
       వడివోనివలపులు గలితే నొగిఁదాఁ బ్రియములు చెప్పీని

చ. 3: వెస నూరకె మొక్కకురే వెంగెము లయ్యీని
       పొసఁగ నూరక దండ నిడిచి పొగడకురే మీరు నన్ను
       పస గల శ్రీవెంకటేశ్వరుఁడు పై పై నన్నుఁ గూడె
       వసమై యాతిని లోనై నడతము వడి నతఁడే మన్నించీని