పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0374-1 శంకరాభారణం సంపుటం: 11-439

పల్లవి: నామనసు వేగిరించీ నాకంటేను
         తామసించఁ బని లేదు తమకించీ వయసు

చ. 1: పోయి వచ్చి తటె నేఁ బొమ్మన్న చోటికి నీవు
       ఆయనా ఆపని నే నన్నట్లనే
       మాయలు గావు గదా మన సొక్క టాయనా
       యీయెడకు నీవెంటే యిప్పు డిట్టె వచ్చెనా

చ. 2: వేలఁ దగిలించుకొన్న వింతలేక యెక్కడిదే
        మేలుసుద్ది నీమొకాన మించీ నదే
        వాలుకరెప్పలకొన వంచి సన్న సేసేవు
        లోలో మాటాడుదము లోనికి రాఁ గదవే

చ. 3: యేఁటికి నవ్వేవే నీవు యెంచినట్టే ఆయనా
       చాటువ నదియ నా సంతోషము
       యీటున శ్రీవెంకటేశుఁ డింతలో విచ్చేసి కూడె
       పాటించి తా నే మనీనె పంతము లీడెరెనూ