పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0373-6 దేసాళం సంపుటం: 11-438

పల్లవి: నీతో మాటాడఁ బోతే నింద వచ్చును
         యేతెరువుఁ బో నోప మాయింటనే వుండే మయ్యా

చ. 1: సిగ్గులు ముదిరితే సెలవికి నవ్వు వచ్చు
       బగ్గన నవ్వితేఁ గోపము వచ్చును
       వొగ్గి కోపగించఁ బోతే వొక టొకటే వచ్చును
       యెగ్గులకు నోపము మాయింటనే వుండే మయ్యా

చ. 2: సరసాలు ముదిరితే సారెఁ జేపట్లకు వచ్చుఁ
       దొరల చేఁ బట్టఁ బోతే దూరు వచ్చును
       మరలి ఆదూరులు మరి యెందు కైనా వచ్చు
       నిరవు లెరిఁగితిమి యింటనే వుండే మయ్యా

చ. 3: తప్పక నిన్నుఁ జూచితే తలపోఁతలకు వచ్చు
       కప్పినతలపోఁతల కాఁక వచ్చును
       యిప్పుడె శ్రీవెంకటేశ యెనసితి విదె నన్ను
       యెప్పుడూఁ బాయక మాయింటనే వుండే మయ్యా