పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0373-4 శంకరాభరణం సంపుటం: 11-436

పల్లవి: ఎంద రైనఁ గలరు నీ కెరుఁగుదు నది నేను
         నింద నీపైఁ బడి నని నే ననేఁ గాని

చ. 1: కాయము నీచేతిది కడు మోహించితిఁ గాన
       యేయడకు నీ వేఁగఁగా నే మౌదునో
       నాయంతకు నే వెరవ నంటున నిన్నందరును
       యీయెడ దూరే రని యెంచుకొనేఁగాని

చ. 2: వుసు రెల్ల నీసొమ్ము వూడిగపుదానఁ గాన
       దెసలు నీచేతవి నీ తెగు వెట్టౌనో
       విసుగ నీసుద్దులకు వెక్కసపుటపకీర్తి
       ముసరి మీఁదట నీపై మోచీ ననీ కాని

చ. 3: బదు కెల్ల నీసొమ్ము పట్టపుదేవులఁ గాన
       యిదె నీరతులలో నే నెంత సేతునో
       పొదిగి శ్రీవెంకటేశ పోనీక కూడితి నన్ను
       అది గాదు నాతో సరి యయితి వనీ కాని