పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0373-3 లలిత సంపుటం: 11-435

పల్లవి: నూఁటికి సెలవు గాఁగ నూలిపోఁగే యందురు
         యేఁటి కిఁక మాఁట లెల్లా నిందులోనె వున్నవి

చ. 1: నిండు విరహతాపాన నీవు రాని కోపాన
       అండ నే మని దూరి నే నంటినో నిన్ను
       వుండుసుద్దు లేల యిఁక వొక్క మాఁటే మొక్కే మిదే
       చండి పెట్టి యే మన్నాఁ జవి గాదు ప్రియము

చ. 2: చెప్పుడు మాఁటలకుఁ గా చిత్తము నిలుప లేక
       వుప్పటించి నిన్ను నెంత వొరసితివో
       ముప్పిరి నాకందు వాయ ముందటికి వచ్చితిమి
       యిప్పు డిఁక నే మన్నా నెరవు లై తోఁచును

చ. 3: చెఱఁగు వట్టి తియ్యఁ గా సిగ్గునఁ దప్పించుకోంటా
       తఱి నాకొనగో రెందు దాఁకించితినో
       నెఱి శ్రీవెంకటేశుఁడ నే నందుకే కూడితిని
       మొఱఁగు మరఁగు లేదు ముంచుకొనీ నవ్వులు