పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0373-2 ముఖారి సంపుటం: 11-434

పల్లవి: కడు గట్టిగుండె నీకుఁ గాఁగాఁ గాక
         అడరి పాయపువారి కంతేసి చెల్లునా

చ. 1: పంతము దప్పినఁ దప్పీ పక్కన నవ్వేవు సుమ్మీ
       యింతిరో నిన్నటిమాట కిపుడు నీవు
       చెంతల నే మిందరము చేరి వేఁడుకోఁ గాను
       కాంతునిఁ గాఁగిట నిట్టై కలయఁగ వలదా

చ. 2: మంకులు దీరినాఁ దీరి మాట లూఁకొనేవు సుమ్మీ
       వుంకువగా రాతిరింటివొట్లకును
       సంకె దీర మీతగవు సరిగా నే తేర్చఁ గాను
       యింకా నేల అలుకలు యియ్యకొన వలదా

చ. 3: సిగ్గులు వీడినా వీడీ సిరసు యెత్తేవు సుమ్మీ
       అగ్గ మై శ్రీవెంకటేశుఁడ డండ నున్నాఁడు
       వెగ్గళిం చాతఁడే నిన్ను వేఁడుక కాఁగిటఁ గూడె
       నిగ్గుల మమ్మిక మెచ్చి నిండుకొన వలదా