పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0373-1 మంగళకౌశిక సంపుటం: 11-433

పల్లవి: నావాఁడ వని నిన్ను నమ్మి యుందును
         యీవేళ నాతోనె యింత గలదా

చ. 1: రావద్దా నీవు నేఁడు రమణుఁడ మాయింటికి
       కావిరి నీకు నేము కడవారమా
       సోవల నెగ్గులు లేవు చుట్టపువరుసే నాకు
       నీ వెరఁగనితగవు నీకుఁ జెప్పేమా

చ. 2: చెప్ప వద్దా నీవు నాకుఁ జేసేపనుల కెల్ల
       నెప్పు డైన నేము నీకు నెదు రాడేమా
       తప్పించుకోఁ బని లేదు తగుల మైనచోట
       ముప్పిరి నీకు వలపు మోపు గట్టేమా

చ. 3: కూడ వద్దా నీకు నీవే కొంగు వట్టి నన్ను నేఁడు
        జాడ దప్పి నీకు మెచ్చనివారమా
        యీడనె శ్రీవెంకటేశ యింత సేసి కలసితి
        వేడుక నీచేఁతలకు వెగ్గళించేమా