పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-6 శ్రీరాగం సంపుటం: 11-432

పల్లవి: నీతో వాదుకు నే నోప
         యేతుల కిఁక నీ వే మైన ననరా

చ. 1: బచ్చనమాటలు పలుమరు నాడఁగ
       యెచ్చుకుందు లిఁక నే మౌనో
       వొచ్చము లే కే నూర కుండఁగా
       యిచ్చకొలఁది నీ వే మైన ననరా

చ. 2: చేకొని బత్తులు సేయఁగ రాఁగా
       నేకొలఁది బడునో యెన్నికలు
       చీకా కయి నే సిగ్గున నుండఁగ
       యీకొలఁదుల నీ వే మైన ననరా

చ. 3: గుఱిగాఁ గాఁగిటఁ గూడఁగఁ రాఁగా
       నెఱుకలు మఱపులు నే మవునో
       నెఱి శ్రీవెంకటనిలయుఁడ నీవే
       యెఱిఁగి కలిసితివి యే మయిన ననరా