పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-3 గుండక్రియ సంపుటం: 11-429

పల్లవి: కన్నవా రెవ్వరు దీనిఁ గడ లేని జవ్వనము
         తన్నుఁ దానె వలపు లింతకుఁ దెచ్చె నయ్యా

చ. 1: మనసులోపలి చింత మాటలాడుదాఁకాఁ
       యెనలేనిమాఁట బయలీఁతకుఁ దెచ్చె
       తనవోని బయలీఁత తమకములకుఁ దెచ్చె
       పెను నావల పింతగాఁ బెరిగె నోయయ్యా

చ. 2: గక్కనఁ జూచినచూపుకాఁక లింతేసికిఁ దెచ్చె
       చిక్కించి కాఁకలు లోలో సిగ్గుకుఁ దెచ్చె
       నిక్కినసిగ్గులు నేఁడీ నివ్వెరగులకుఁ దెచ్చె
       పిక్కటిల్లి వల పింత పెరిగె నోయయ్యా

చ. 3: మితి లేని మోహములు మేరలు మీరఁగఁ దెచ్చె
       రతులమేరలు యింత రవ్వకుఁ దెచ్చె
       యిత వై శ్రీవెంకటేశ యిట్టె నీవు గూడితిని
       కత రై వలపు లింతగాఁ బెరిగె నయ్యా