పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0372-2 సాళంగనాట సంపుటం: 11-428

పల్లవి: నాకు నీమొగము చూచి నవ్వు వచ్చీని
         కాకు సేయ కిఁక నైన గతి గూడవయ్యా

చ. 1: పలుకు లెన్ని గలవు పాటించి బొంకఁగఁ బోతే
       అలరీనా నీవంటి అందగానికి
       చలము సాధించితివి చక్క నాయఁ బను లెల్ల
       వెలయ మాయింటి కిఁక విచ్చేయవయ్యా

చ. 2: ఆన లెన్నైనఁ గలవు అటమటించే నంటే
       యీనెపాన నీవంటి యెమ్మెకానికి
       నీనేర్పు లీడెరె నిన్ను నిందరు మెచ్చిరి
       వీనులు చల్ల నాయను వీడె‌ మిందవయ్యా

చ. 3: వొడఁబా టైనఁ గద్దు వోపిక గలిగితేను
       విడువక నీవంటి వేసదారికి
       తొడిఁబడఁ గూడితివి దొమ్మితో శ్రీవెంకటెశ
       బడలితివి రతులఁ బవ్వళించవయ్యా